Balakrishna as ‘Dada’: ‘దాదా’గా బాలకృష్ణ.. క్రిస్మస్కు థియేటర్లలోకి
థియేటర్లలోకి
Balakrishna as ‘Dada’: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు టైటిల్ ఖరారైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111కు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా రెండో చిత్రం కావడం విశేషం. తాజాగా ‘దాదా’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
గ్లింప్స్‌లో బాలకృష్ణను చాలా పవర్‌ఫుల్, భయంలేని పాత్రలో చూపించారు. ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణ కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఉండగా.. చుట్టూ ఉన్న పోలీసులు ఆయనపై తుపాకులు గురిపెడతారు. అయినా ఏమాత్రం భయపడకుండా బాలకృష్ణ పోలీసులతో తలపడతారు. చివర్లో టేబుల్‌పై ఒక కాలు పెట్టి, చేతిలో తుపాకీ పట్టుకుని తనదైన స్టైల్‌లో పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతారు.
“నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్లకి బలుపు ఉండాలి, గన్స్‌కి గట్స్ ఉండాలి” అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాలకృష్ణ సినిమాలకు తగ్గట్టుగా మాస్ టచ్‌తో సాగింది.
గ్లింప్స్ చివర్లో ‘దాదా’ సినిమా 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.