Balakrishna Receives a Rare Honor: గోవాలో బాలకృష్ణకు అరుదైన గౌరవం..

బాలకృష్ణకు అరుదైన గౌరవం..

Update: 2025-11-21 05:56 GMT

Balakrishna Receives a Rare Honor: గోవాలో వైభవంగా జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో నందమూరి బాలకృష్ణను ఘనంగా సత్కరించారు. నటుడిగా ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అరుదైన గౌరవం దక్కింది. బాలకృష్ణను గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రి మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వంటి ప్రముఖులు శాలువాతో కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.

IFFI వేడుక విశేషాలు

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. నటుడు అనుపమ్ ఖేర్ సహా పలువురు సినీ ప్రముఖులు ప్రారంభ వేడుకకు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్ ముగింపు వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సత్కరించనున్నారు. ఆయన కూడా నటుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.

Tags:    

Similar News