Balakrishna’s Daughter Steals the Spotlight: బాలకృష్ణ కూతురా మజాకా.. క్రేజీ డ్యాన్స్ వీడియో వైరల్!

క్రేజీ డ్యాన్స్ వీడియో వైరల్!

Update: 2026-05-30 12:13 GMT

Balakrishna’s Daughter Steals the Spotlight: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే.. ఇప్పుడు ఆయన చిన్న కుమార్తె తేజస్విని సోషల్ మీడియాను ఊపేస్తోంది! సాధారణంగా కెమెరా వెనుక కాస్త రిజర్వ్‌డ్‌గా ఉండే తేజస్విని.. లేటెస్ట్‌గా డ్యాన్స్ ఫ్లోర్‌పై వేసిన మాస్ స్టెప్పులకు ఇంటర్నెట్ మొత్తం షాక్ అవుతోంది. టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది!

సాధారణంగా నందమూరి ఫ్యామిలీలోని మహిళలు గ్లామర్ ప్రపంచానికి, స్క్రీన్ ప్రెజెన్స్‌కు కాస్త దూరంగా ఉంటారు. కానీ, తేజస్విని ఆ గీతలను దాటి తనలోని అల్టిమేట్ ఎనర్జీని బయటకు తీశారు. ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌కు ఏమాత్రం తీసిపోని గ్రేస్, అదిరిపోయే టైమింగ్‌తో ఆమె వేసిన స్టెప్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. "అచ్చం నాన్న పోలికే.. బాలయ్య బాబు మాస్ ఎనర్జీ వంద శాతం వచ్చింది.. బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు" అంటూ క్రేజీ కామెంట్స్ కురిపిస్తున్నారు!

నిజానికి తేజస్విని కేవలం డ్యాన్స్‌తోనే కాదు.. తన మల్టీ-టాలెంట్‌తోనూ ఇండస్ట్రీని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆహా ఓటీటీలో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' టాక్ షో గ్రాండ్ సక్సెస్ వెనుక.. తేజస్విని నిర్మాణ పర్యవేక్షణ, ప్లానింగ్ ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆమె వర్క్ చేశారు. వైజాగ్ ఎంపీ, గీతం విద్యాసంస్థల ప్రెసిడెంట్ మతుకుమిల్లి శ్రీభరత్‌ను వివాహం చేసుకున్న తేజస్విని.. ఒకవైపు ఫ్యామిలీని, భర్త బిజినెస్‌లను చూసుకుంటూనే, మరోవైపు క్రియేటివ్ ఫీల్డ్‌లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు.బాలయ్య బాబు లెగసీని కూతురు తేజస్విని కూడా తనదైన స్టైల్‌లో కంటిన్యూ చేస్తోందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News