Balayya and Gopichand Malineni’s New Film: బాలయ్య, గోపించంద్ మలినేని సినిమా షురూ
గోపించంద్ మలినేని సినిమా షురూ
Balayya and Gopichand Malineni’s New Film: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో కొత్త సినిమా అధికారికంగా ప్రారంభమైంది.వారి బ్లాక్‌బస్టర్ సినిమా 'వీర సింహారెడ్డి' తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది .ఈ ప్రాజెక్ట్ నిన్న నవంబర్ 26 ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్నకూతురు తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాలకృష్ణకు ఇది 111వ చిత్రం.ఇది ఒక చారిత్రక యాక్షన్ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోంది.
విడుదలైన పోస్టర్‌ను బట్టి బాలకృష్ణ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంచేయనున్నట్లు తెలుస్తోంది. ఒక లుక్‌లో పవర్‌ఫుల్ యోధుడిగా/రాజుగా ,మరొక లుక్‌లో రుద్రాక్షమాలతో శక్తివంతమైన అవతారంలో కనిపించనున్నారు.నయనతార హీరోయిన్ గా చేస్తున్నారు.బాలయ్య సరసన నయనతార కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందించగా.. వెంకట సతీష్ కిలారు (వృద్ది సినిమాస్ బ్యానర్‌పై)
నిర్మిస్తున్నారు. డిసెంబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.