Balayya Speeds Up: స్పీడ్ పెంచిన బాలయ్య.. రెండు వారాల్లో అఖండ2 కంప్లీట్

రెండు వారాల్లో అఖండ2 కంప్లీట్;

Update: 2025-07-25 06:01 GMT

Balayya Speeds Up: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ సీక్వెల్ చిత్రం అఖండ 2: తాండవం.2021లో భారీ విజయం సాధించిన అఖండకు సీక్వెల్‌ గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో షూటింగ్‌‌ జరుగుతోంది. మోతుగూడెంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ అఘోరా గెటప్‌లో నదిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వీడియోలు లీక్ అయ్యాయి.తర్వాతి షెడ్యూల్ ప్రయాగ్ రాజ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ రెండు వారాల పాటు షూట్ పూర్తి చేస్తే సినిమా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 9న 'అఖండ 2' టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కూడా బాలయ్య అభిమానులను ఆకట్టుకుంది.

'అఖండ 2 2025 దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఎస్.ఎస్. థమన్ అఖండ 2 కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సుమారు ₹160 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.  

Tags:    

Similar News