Blockbuster Combo in Tollywood: బాలయ్య మాస్.. వివేక్ ఆత్రేయ క్లాస్.. టాలీవుడ్‌లో అదిరే కాంబో..

టాలీవుడ్‌లో అదిరే కాంబో..

Update: 2026-02-28 13:51 GMT

Blockbuster Combo in Tollywood: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే నందమూరి బాలకృష్ణ. అరవై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద'నటసింహంలా గర్జిస్తున్నారు. తాజాగా ఆయన తదుపరి ప్రాజెక్టుల లైనప్ చూస్తుంటే, బాలయ్య రూటు మార్చి ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో వివేక్ ఆత్రేయతో ఆయన చేయబోయే సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వివేక్ ఆత్రేయ - బాలయ్య: అంచనాలను మించిన కాంబినేషన్..

బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి సెన్సిబుల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. రీసెంట్‌గా సరిపోదా శనివారంతో మాస్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా డీల్ చేయగలనని నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు నేరుగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమా కథా విస్తృతి చాలా పెద్దదిగా ఉండటంతో దీనిని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బాలయ్యతో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనుంది.

ముంబై మాఫియా డాన్‌గా బాలయ్య..

మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోయే NBK111 చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొదట పీరియాడికల్ డ్రామాగా అనుకున్న ఈ కథ, తాజా సమాచారం ప్రకారం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య పవర్‌ఫుల్ ముంబై మాఫియా డాన్‌ గా కనిపించనున్నారు. మార్చి 5న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags:    

Similar News