Bandla Ganesh: సినిమా నిర్మాణంపై అభిమానులకు బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి
అభిమానులకు బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి
By : PolitEnt Media
Update: 2025-11-05 08:22 GMT
Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన సినిమా రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై అభిమానులకు, మీడియాకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఎలాంటి సినిమానూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. అలాగే ఎవరితో సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదని తెలిపారు. తాను కొత్త సినిమాలు నిర్మిస్తున్నట్లు వార్తలు రాయడం మానుకోవాలని, అలా చేయడం తనను ఇబ్బంది పెడుతోందని ఆయన కోరారు.
ఇటీవల జరిగిన పలు సినిమా వేడుకలకు బండ్ల గణేశ్ హాజరుకావడంతో ఆయన నిర్మాతగా మళ్లీ సినీ రంగంలోకి వస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తనకు అందరి మద్దతు, ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.