Bandla Ganesh: మహేష్ బాబును కలిసిన బండ్ల గణేష్.. కుమార్తె వివాహానికి ఆత్మీయ ఆహ్వానం

ఆత్మీయ ఆహ్వానం

Update: 2026-07-25 04:09 GMT

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో త్వరలో వివాహ వేడుకలు జరగనున్నాయి. తన కుమార్తె జనని వివాహానికి టాలీవుడ్ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించే పనిలో పడ్డారు బండ్ల గణేష్.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులను బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమార్తె జనని వివాహానికి హాజరు కావాలని కోరుతూ మొదటి ఆహ్వాన పత్రికలలో ఒకదానిని వారికి స్వయంగా అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు, ఇటీవల తన కుటుంబ ఆస్తి వేలానికి సంబంధించి వస్తున్న రూమర్స్‌పై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. షేక్‌పేట్‌లోని కేవలం 500 చదరపు గజాల ఆస్తికి సంబంధించిన లీగల్ కేస్ మాత్రమే నడుస్తోందని, తన మొత్తం ఆస్తులన్నీ పోయాయని వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తూనే, ఈ వివాదం కేవలం ఒకే ఆస్తికి పరిమితమని ఆయన స్పష్టం చేశారు

Tags:    

Similar News