Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు: త్వరలోనే కూతురు జనని వివాహం

త్వరలోనే కూతురు జనని వివాహం

Update: 2026-04-04 02:32 GMT

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో సందడి మొదలైంది. తన గారాల పట్టి జనని బండ్ల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న బండ్ల గణేష్, తన కాబోయే అల్లుడు సూర్యతేజ చిలుకూరిని అభిమానులకు పరిచయం చేశారు. ఇప్పటికే బండ్ల గణేష్ నివాసంలో పెళ్లి పనులు షురూ అయ్యాయి. తాజాగా సాంప్రదాయబద్ధంగా 'పసుపు కుంకుమ' వేడుకను నిర్వహించారు. దేవుడి దయ, పెద్దల ఆశీస్సులతో త్వరలోనే వివాహం ఘనంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బండ్ల గణేష్‌కు ఇద్దరు కుమారులు హితేష్, హిరేష్‌లతో పాటు కూతురు జనని ఉన్నారు. జననికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బండ్ల గణేష్ గతంలో పంచుకున్నారు. ఆయన తన భార్యకు రోడ్డుపై దీనస్థితిలో ఒక నేపాలీ చిన్నారి కనిపించిందని, ఆ పాపను తాము దత్తత తీసుకున్నామని మనసు విప్పారు. ఆ చిన్నారే ఈ జనని. బండ్ల దంపతుల ఉదారతను అప్పట్లో నెటిజన్లు ఎంతో ప్రశంసించారు. ఆ పాపను సొంత కూతురిలా పెంచి, ఇప్పుడు పెళ్లి చేస్తుండటంతో మరోసారి ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సినిమా రంగంలో కూడా బండ్ల గణేష్ కొత్త అడుగులు వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఆయన 'BG బ్లాక్‌బస్టర్స్' పేరుతో రెండో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా, హృదయానికి హత్తుకునే మంచి కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే సినిమాలు నిర్మిస్తానని ఆయన వెల్లడించారు. విశేషమేమిటంటే, ఈ బ్యానర్‌కు తన కూతురు జనని కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ బండ్ల గణేష్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Tags:    

Similar News