Bellamkonda Sai Sreenivas: స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది..కాబోయే భార్యపై బెల్లంకొండ

కాబోయే భార్యపై బెల్లంకొండ

Update: 2026-04-08 03:56 GMT

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ.. తన పెళ్లి కబురును అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు ఈ యువ హీరో. ఈ నెల 29వ తేదీన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో వీరి వివాహం వైభవంగా జరగనుంది. కొండపైన స్వామివారి ఆశీస్సులతో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సాయి శ్రీనివాస్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. తన కాబోయే భార్యతో కలిసి దిగిన ఈ క్యూట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసి నెటిజన్లు "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన ఎంగేజ్ మెంట్ గురించి బెల్లంకొండ ఎమోషనల్ పోస్ట్... ఈ క్షణం నుంచి అంతా మారిపోతుంది.."నిండు మనసుతో ఒకరి కళ్ళల్లో ఒకరు మాత్రమే కనిపిస్తూ, మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన శాశ్వతమైన బంధంలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ నిశ్చితార్థ వేడుక గురించి చెబుతూ.. ఇందులో ఎలాంటి హడావిడి లేదని, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు.. ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ జంట మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి అని పోస్ట్ చేశారు.

Tags:    

Similar News