Bellamkonda Sai Sreenivas: బెల్లం కొండ పెళ్లి డేట్ ఫిక్స్
పెళ్లి డేట్ ఫిక్స్
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సాయి శ్రీనివాస్ వివాహ వేడుకలకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారైంది.
రేపు అంటే ఏప్రిల్ 5వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగనుంది. ఇక పెళ్లి విషయానికొస్తే.. ఏప్రిల్ 29న ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో వీరి వివాహం శాస్త్రోక్తంగా జరగబోతోంది. తిరుపతిలో పెళ్లి ముగిసిన తర్వాత, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో మే 1న గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ (వివాహ విందు) ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
గత నెలలోనే తన కాబోయే భార్యను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేస్తూ సాయి శ్రీనివాస్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై నమ్మకం ఉంచినందుకు.. నా ప్రపంచాన్ని పాజిటివిటీతో, చిరునవ్వులతో నింపినందుకు థాంక్స్. నీ ముఖంపై ఆ నవ్వు ఎప్పటికీ వాడిపోకుండా చూసుకుంటాను' అంటూ తన ప్రేమను చాటుకున్నారు.ప్రస్తుతం ఈ మెగా వెడ్డింగ్ అప్‌డేట్‌తో బెల్లంకొండ ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.