Ritu Chowdary’s Emotional Post: ప్రేమలో మోసపోయా.. డిప్రెషన్‌లోకి వెళ్లా..బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్ వైరల్..
బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్ వైరల్..
Ritu Chowdary’s Emotional Post: బుల్లితెర నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసిన ఒక సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, ప్రేమ విఫలం కావడం వల్ల తానూ పడుతున్న వేదనను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్‌తో తన రిలేషన్ బ్రేక్ అయ్యిందనే విషయాన్ని ఆమె అధికారికంగా స్పష్టం చేశారు.
నా ఫ్రెండ్‌తోనే రిలేషన్.. హార్ట్ బ్రేక్ అయ్యింది..
రీతూ తన పోస్ట్‌లో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు అభిమానులను కలిచివేస్తున్నాయి. తాను ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని, కానీ చివరకు తనకు మోసమే మిగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినైతే ప్రేమించానో, ఆ వ్యక్తి తన స్నేహితురాలు అని చెప్పుకున్న అమ్మాయితోనే రిలేషన్‌లోకి వెళ్లడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రీతూ వెల్లడించారు. అమ్మాయిలను జడ్జ్ చేయడం సమాజానికి చాలా సులభమని, కానీ వారి లోపల ఉండే బాధను ఎవరూ చూడలేరని ఆమె వాపోయారు.
నవ్వుతూనే డిప్రెషన్‌లో ఉన్నా..
ప్రేమలో ఎదురైన ఈ దెబ్బతో తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లానని రీతూ తెలిపారు. అయితే తన కెరీర్ కోసం, బాధ్యతల కోసం ముఖంపై నవ్వును నటిస్తూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నానని, లోపల మాత్రం చాలా బాధను దాచుకున్నానని పేర్కొన్నారు. తనపై వస్తున్న కొన్ని నెగిటివ్ ఆరోపణలు తనను మరింత వేధిస్తున్నాయని, ప్రస్తుతానికి నిశ్శబ్దాన్నే తన సమాధానంగా మార్చుకున్నానని ఆమె స్పష్టం చేశారు.
అండగా నిలుస్తున్న అభిమానులు:
రీతూ చౌదరి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ చూసిన నెటిజన్లు, ఆమె సహచర నటీనటులు స్టే స్ట్రాంగ్ రీతూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలతో అలరించే రీతూ వెనుక ఇంత బాధ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.