Bhagavanthudu Movie: పల్నాడు బ్యాక్ డ్రప్ లో భగవంతుడు

భగవంతుడు

Update: 2026-01-31 04:39 GMT

Bhagavanthudu Movie: తిరువీర్, ఫరియా అబ్దుల్లా,రిషి లీడ్ రోల్స్‌‌‌‌లో జి.జి.విహారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భగవంతుడు’. ఏషియన్ ఫిలిమ్స్ సమర్పణలో రవి పనస నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘ఈ స్ర్కిప్ట్ వినగానే బాగా నచ్చింది. రూరల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే ఈ కథ చాలా రియలిస్టిక్‌‌‌‌గా ఉంటుంది. గొప్ప సినిమా అవుతుంది’ అని అన్నాడు. ఈ చిత్రంలో తాను కొత్తగా కనిపిస్తానని ఫరియా అబ్దుల్లా చెప్పింది. ‘సైతాన్’ వెబ్ సిరీస్ తర్వాత తెలుగులో నటిస్తున్న సినిమా ఇదని, సమాజంలోని గొంతు విప్పలేని వాళ్లకు గొంతుకగా ఇది నిలుస్తుందని నటుడు రిషి అన్నాడు. డైరెక్టర్ విహారి మాట్లాడుతూ ‘మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన చుట్టూ సమాజంలో ఉన్న వైరుధ్యాలు తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుంది. పల్నాడు బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తీస్తున్నాం’ అని చెప్పాడు. ప్రొడ్యూసర్ రవి పనస మాట్లాడుతూ ‘డైరెక్టర్ విహారి కథ చెప్పినప్పుడు అసురన్, కాంతార, కర్ణన్, జైభీమ్ వంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఇలాంటి కథకు స్టేజ్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఉండాలని తిరువీర్, ఫరియాను తీసుకున్నాం. ఏప్రిల్‌‌‌‌లో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వేణు ఊడుగుల, నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ హిల్స్ సతీష్ టీమ్‌‌‌‌ను విష్ చేశారు.

Tags:    

Similar News