మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీమ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
2027 సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. త్రేతాయుగంలో ప్రారంభమై, వారణాసిలో 512 CE గుండా ప్రయాణించి, 2027 CEకి మారి, త్రేతాయుగం (7200 BCE)కి తిరిగి వస్తుందని గ్లింప్స్‌లో చూపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. రుద్ర పాత్రలో పవర్‌ఫుల్‌గా మహేష్ బాబు, మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం అందరినీ గర్వపడేలా చేస్తుందని మహేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేయగా, గ్లోబ్‌ట్రాటర్, టైమ్‌ట్రాటర్ అనే ట్యాగ్‌లైన్‌లతో ఈ చిత్రం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.