Actress Bhagya Sri Borse: భాగ్యశ్రీ ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే

ఆ ఒక్క సినిమాపైనే

Update: 2026-02-19 05:02 GMT

Actress Bhagya Sri Borse: భాగ్య శ్రీ బోర్సే.. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ అమ్మడి సినిమాలు అంతగా ఆడకపోయినా.. వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. ఇక 'మిస్టర్ బచ్చన్' తో లాంచ్ అయిన ఈ ముంబై బ్యూటీ కెరీర్ లో ఇంత వరకూ కమ ర్శియల్ గా ఒక్క హిట్ కూడా పడలేదు. అయినా టాలెంట్ సహా అందం, అభినయంతోనే అవకాశాలు అందు కుంటుంది. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్. ఆంధ్రాకింగ్ తాలూకా ఇలా వరుసగా మూడు ప్లాపులతో హ్యా ట్రిక్ నమోదు చేసింది. 'కాంత'తో' కోలీవుడ్ డెబ్యూ అయినా అక్కడా నిరాశ తప్పలేదు. ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్సే చేతిలో ఉన్నది ఒకే ఒక్క చిత్రం. అదే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న 'లెనిన్'. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో నుంచి హైప్ క్రియేట్ అయ్యింది. అఖిల్ కి కూడా ఇంత వరకూ సరైన హిట్ లేదు. 'లెనిన్' తో మంచి హిట్ అందుకుంటాడనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ మూవీ సక్సెస్ అయితే ఇద్దరి కెరీర్ కలిసొస్తుంది. ముఖ్యంగా భాగ్యశ్రీ ఆశలన్నీ 'లెనిన్' పైనే పెట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తేనే భాగ్య శ్రీకి మరిన్ని కొత్త చాన్స్లు వస్తాయని సినీ సర్కిల్స్ వినిపిస్తోంది.

Tags:    

Similar News