Bharta Mahashayulaku Vignapthi: మార్చి 13న ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

Update: 2026-03-06 04:41 GMT

 Bharta Mahashayulaku Vignapthi: రవితేజ, డింపుల్ హయాతి, అశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. సాధారణంగా థియేటర్ లో విడుదలైన సినిమాలు 4 నుంచి 6 వారాల్లో ఓటిటిలోకి వస్తాయి. అయితే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విషయంలో స్ట్రీమింగ్ కాలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ జీ 5 కొనుగోలు చేసింది. ఆ మధ్య స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. అనేక మార్లు ఓటీటీ స్టెమింగ్ వాయిదా వేసిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. థియేటర్ రిలీజ్కు సుమారు 59 రోజుల తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కు రామండటం గమనార్హం. ఈ సారైనా ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుందో లేదా మరోసారి వాయిదా వేస్తారో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News