Bhartha Mahashayulaku Vignapti: 'మాస్ మహారాజా' టైటిల్ పేటెంట్ నాదే: హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2026-01-12 09:14 GMT

Bhartha Mahashayulaku Vignapti: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ-రిలీజ్ వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత కోలాహలంగా సాగింది. ఈ వేడుకకు దర్శకులు హరీష్ శంకర్, బాబీ, శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రవితేజ 'మాస్ మహారాజా' అనే ట్యాగ్‌ను తొలగించమని కోరారని వార్తలు వచ్చాయి. కానీ ఆ బిరుదును సృష్టించింది నేనే, దానిపై పేటెంట్ హక్కులు నావే. అది వాడాలా వద్దా అనేది ఆయన ఇష్టం. పవన్ కళ్యాణ్ తర్వాత విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా ఉండే అరుదైన వ్యక్తిత్వం రవితేజది. దర్శకుడిగా నాకు జన్మనిచ్చింది ఆయనే. మా గత సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, త్వరలోనే ఆయనకు ఒక సాలిడ్ హిట్ ఇస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. హీరో రవితేజ మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. "ఈ సినిమాలో సీరియస్ ఎమోషన్స్ లేదా భారీ ఫైట్లు ఉండవు, మొదటి నుండి చివరి వరకు కేవలం వినోదం మాత్రమే ఉంటుంది. సునీల్ పాత్ర 'దుబాయ్ శీను'ను గుర్తు చేస్తుంది. సత్య తన నటనతో అదరగొట్టాడు. భీమ్స్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. సినిమాలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంది, అది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కిషోర్ తిరుమలతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని ఉంది" అని రవితేజ పేర్కొన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల స్టేజ్ మీద డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లతో ఇది రవితేజకు 9వ సినిమా. 'మిరపకాయ్' సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా రిపీట్ అవుతుందని హరీష్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రవితేజ తన తర్వాతి సినిమాను దర్శకుడు శివ నిర్వాణతో చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.

Tags:    

Similar News