Before Kannappa Release: కన్నప్ప రిలీజ్ ముందు బిగ్ షాక్.. విష్ణు ఇంట్లో ఐటీ,జీఎస్టీ సోదాలు
విష్ణు ఇంట్లో ఐటీ,జీఎస్టీ సోదాలు;
Before Kannappa Release: మంచు విష్ణు లీడ్ రోల్ వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప ఈ సినిమాను జులై 27న రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు ఐటీ (ఇన్కం ట్యాక్స్) అధికారులు మంచు విష్ణు ఆఫీస్ లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది.
ఇవాళ హైదరాబాద్ మాదాపూర్ లోని మంచు విష్ణు కార్యాలయం ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నప్ప సినిమా బడ్జెట్ గురించి ఆరా తీస్తున్నారు. ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా బడ్జెట్ కు సంబంధించిన ఖర్చులు, బ్యాలన్ షీట్లను పరిశీలిస్తున్నారు. ఏ ఏ అకౌంట్ల నుంచి నిధులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. ట్యాక్స్, జీఎస్టీ ఎంత వరకు చెల్లించారనే కోణంలో సోదాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. సరిగ్గా రిలీజ్ కు ముందు సోదాలు నిర్వహించడం సినిమా యూనిట్, అభిమానుల్లో ఆందోళన కలిగించే అంశం.