Akhanda 2 Release Postponed: బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ షాక్..అఖండ 2 రిలీజ్ వాయిదా

అఖండ 2 రిలీజ్ వాయిదా

Update: 2025-12-05 05:42 GMT

Akhanda 2 Release Postponed: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా విడుదల వాయిదా పడింది.షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదల కావడానికి కొద్ది గంటల ముందు (డిసెంబర్ 4 రాత్రి) సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. "అనివార్య కారణాలు"అని నిర్మాణ సంస్థ చెప్పినప్పటికీ, సినీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ప్రధానంగా ఆర్థికపరమైన , న్యాయపరమైన సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థతో లావాదేవీల విషయంలో ఉన్న వివాదం కారణంగా, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరగా, కోర్టు స్టే (నిలుపుదల ఉత్తర్వులు) విధించినట్లుగా ప్రచారం జరిగింది. కొంతమంది టెక్నీషియన్లు, ఫైనాన్షియర్‌లకు చెల్లింపులు చేయాల్సి ఉండటం కూడా వాయిదాకు మరో కారణంగా చెబుతున్నారు.నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, అభిమానులకు కలిగిన నిరాశకు చింతిస్తున్నామని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది.ప్రస్తుతానికి, 'అఖండ 2' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

కోర్టు స్టే, ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.సమస్యలు పరిష్కరించబడితే, సినిమా విడుదల పూర్తిగా ఆగిపోకుండా కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. చివరి నిమిషంలో విడుదల వాయిదా పడటంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశ మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News