New “iBomma 2.0” Creates Buzz: సినీ పరిశ్రమకు భారీ షాక్: సరికొత్తగా "ఐ బొమ్మ 2.0"

సరికొత్తగా "ఐ బొమ్మ 2.0"

Update: 2026-05-13 10:54 GMT

New “iBomma 2.0” Creates Buzz: పైరసీ ప్రపంచంలో తిరుగులేని వెబ్‌సైట్‌గా పేరు తెచ్చుకున్న ఐ బొమ్మ, గతంలో మూతపడిన తర్వాత మళ్లీ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈసారి "ఐ బొమ్మ 2.0" పేరుతో, మునుపటి కంటే మెరుగైన HD క్వాలిటీతో కంటెంట్‌ను అందిస్తామంటూ నిర్వాహకులు ప్రకటించడం చిత్ర పరిశ్రమను వణికిస్తోంది. పైరసీని అరికట్టే క్రమంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. 2025 నవంబర్ 15, ఈ వెబ్‌సైట్‌ను పోలీసులు అధికారికంగా బ్లాక్ చేశారు. ఈ సైట్ వెనుక ఉన్న కీలక వ్యక్తి రవిని సైతం పోలీసులు పట్టుకుని, జైలుకు తరలించారు. కొంతకాలం పాటు ఆయన శిక్షను కూడా అనుభవించారు.

గతంలో ఐ బొమ్మ కేసును అప్పటి పోలీస్ ఉన్నతాధికారి సి.పి. సజ్జనార్ అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. పైరసీ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగిస్తామని హెచ్చరించారు. అయితే, ఆయనకే షాక్ ఇస్తూ ఇప్పుడు నిర్వాహకులు మళ్లీ యాక్టివ్ అయ్యారు. రవిని మించిన నెట్‌వర్క్ ఏదైనా దీని వెనుక ఉందా? లేక జైలు నుంచి వచ్చిన రవినే మళ్లీ రంగంలోకి దిగారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

మళ్లీ పునఃప్రారంభమైన ఈ ఐ బొమ్మ 2.0 వెబ్‌సైట్‌లో "గాయపడ్డ సింహం" అనే సినిమాను మొదటి మూవీగా అప్‌లోడ్ చేశారు. ఈ సినిమా పేరు కూడా ఇండస్ట్రీపై తాము తిరిగి యుద్ధం ప్రకటిస్తున్నామనే సంకేతాన్ని ఇచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైరసీ వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుండటంతో, ఐ బొమ్మ రీ-ఎంట్రీపై ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ రెండో వెర్షన్‌ను ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News