Big Update from Peddhi: పెద్ది నుంచి బిగ్ అప్‌డేట్.. శ్రీలంకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

శ్రీలంకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

Update: 2025-10-24 14:30 GMT

Big Update from Peddhi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ పెద్ది గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ సినిమా తదుపరి కీలక షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమైంది. శ్రీలంకలోని రమణీయమైన ప్రదేశాలలో కొన్ని రోజుల పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

భారీ హంగులతో పెద్ది..

వెంకట సతీశ్ కిలారు వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇటీవలే వినాయక చవితి సందర్భంగా మైసూరులో ఒక భారీ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించగా.. ఏకంగా 1000 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్‌పై ఈ పాటను షూట్ చేశారు.

కొత్త మేకోవర్‌లో చరణ్.. స్టార్ తారాగణం

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టెక్నికల్ హైలైట్స్

ఈ సినిమాకు టెక్నికల్ టీం కూడా పెద్ద ఆకర్షణగా నిలవనుంది. స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పెద్ది చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News