NTR in Kantara Sequel: బిగ్ అప్‌డేట్.. కాంతార స్వీక్వెల్లో ఎన్టీఆర్..?
కాంతార స్వీక్వెల్లో ఎన్టీఆర్..?;
NTR in Kantara Sequel: ‘కాంతార’ సినిమా హిట్ అయిన తర్వాత, ఈ సినిమాకు ప్రీక్వెల్ తీసే పనిలో పడింది మూవీ టీమ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. అభిమానులు ఈ సినిమా నుండి చాలా ఆశిస్తున్నారు. ఇంతలో ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్‌డేట్ వచ్చింది. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ మాత్రమే కాకుండా సీక్వెల్ కూడా రాబోతోందని తెలుస్తోంది.
‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ 280 రోజులకు పైగా జరిగింది. రిషబ్ గత మూడేళ్లుగా ఈ సినిమాపైనే ఉన్నాడు. ఈ సినిమా తారాగణం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఈ సినిమాలో మోహన్ లాల్ నటించినట్లు చెబుతున్నారు. కానీ దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురావాలనే ప్రణాళిక కూడా ఉంది. అలాంటిదేదైనా జరిగితే దానికి ‘కాంతార: చాప్టర్ 2’ అని టైటిల్ పెట్టవచ్చు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారని టాక్ వినిపిస్తోది..? అయితే దీని గురించి టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మధ్య మంచి బంధం ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కుందాపూర్ వెళ్లారు. ఈ సమయంలో ‘కాంతార’ సినిమాలో నటించే ఆఫర్ గురించి చర్చించారా అనే ప్రశ్న తలెత్తింది. ఎన్టీఆర్ ఇప్పటికే ‘వార్ 2’ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టాడు. కన్నడలో కూడా ఒక పాట పాడాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్ బిజీగా ఉన్నాడు.