Bigg Boss: అగ్నిపరీక్ష ఫ్లేమ్ టూర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌లోకి ఎంట్రీపై క్లారిటీ!
హౌస్‌లోకి ఎంట్రీపై క్లారిటీ!
Bigg Boss: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా దూసుకుపోతున్న 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 10 కోసం రంగం సిద్ధమవుతోంది. అయితే ప్రధాన షో కంటే ముందే, సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ తలుపులు తెరిచే 'అగ్నిపరీక్ష సీజన్ 2' త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు నిర్వహిస్తున్న 'ఫ్లేమ్ టూర్' తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
విజయనగరంలో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ ఫ్లేమ్ టూర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సాధారణ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, తన ఆటతీరుతో టైటిల్ కొట్టిన విజయనగరం కుర్రాడు కళ్యాణ్ పడాల ఈ టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తన విజయానికి అభిమానుల ప్రేమే కారణమని చెబుతూ కళ్యాణ్ సందడి చేయగా.. విశాఖపట్నంలో జరిగిన టూర్‌లో మరో ఫైనలిస్ట్ డెమాన్ పవన్ కూడా జతకలిశారు. అగ్నిపరీక్ష అంటే కేవలం టాస్కులు మాత్రమే కాదని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే గొప్ప వేదికని ఈ ఇద్దరూ యువతకు స్పూర్తినిచ్చారు.
ఆగస్టు 15 నుంచి అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రసారం కానుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది. వేల దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులతో ఫైనల్ రౌండ్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. మరి ఈసారి సామాన్యుల నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే!