Bigg Boss Beauty: పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ..వరుడు ఎవరంటే.?

వరుడు ఎవరంటే.?;

Update: 2025-06-07 08:47 GMT

Bigg Boss Beauty:బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ నటి శుభశ్రీ రాయగురు పెళ్లిపీటలు ఎక్కబోతుంది. మనోభావాలు పాప పేరుతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ తన ప్రియుడి జయ్ మైసూర్‌ను పెళ్లి చేసుకోబోతుంది. శుక్రవారం (జూన్ 6న) వీరిద్దరి ఎంగేజ్‌మెంట్, మెహందీ, సంగీత్ వేడుకలు హైదరాబాద్‌లో గ్రాండ్గా జరిగాయి. అజయ్ మైసూర్ -శుభశ్రీ కలిసి ఇటీవల మెసెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు.

శుభశ్రీ తన పెళ్లి విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. దీంతో నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాకుండా శుభశ్రీకి కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే, అతడి పేరు అజయ్ మైసూర్.. అలియాస్ AJ మైసూర్. ప్రస్తుతంఅజయ్ నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు. వీటితో పాటు పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ అల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు.వీరిద్దరి వివాహం జూలైలో ఆస్ట్రేలియాలో జరగనుంది.

Tags:    

Similar News