Bollywood Actress Sonakshi Sinha: 16 నెలలుగా ప్రెగ్నెంట్.. వరల్డ్ రికార్డ్

వరల్డ్ రికార్డ్

Update: 2025-10-17 12:24 GMT

Bollywood Actress Sonakshi Sinha: సుధీర్ బాబు హీరోగా వస్తోన్న 'జటాధర'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో కనిపించనుంది. ఇందులో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ కూడా కీ రోల్ ప్లే చేయనుంది. ఈ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా సంగతి పక్కనపెడితే.. ఈ బ్యూటీపై ప్రెగ్నె న్సీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆమె తన భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి దివాళీ బాష్కు హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్లో కనిపించి సందడి చేసింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజ న్స్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా వీటిపై సోనాక్షి కౌంటర్స్ ఇచ్చింది. 'మన లవ్లీ, హైపర్ ఇంటె లిజెంట్ మీడియా నేను 16 నెలలుగా ప్రెగ్నెంట్ అని చెబుతోంది. ఇది హ్యూమన్ హిస్టరీలో వరల్డ్ రికార్డ్. సరదాగా నా ఉదర భాగంపై చెయ్యి వేసి ఫొటో దిగి నందుకు ఇలాంటి వదంతులు క్రియేట్ చేశారు. వాటికి మా ఆన్సర్ ఇదే. ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగిం చండి' అంటూ ఇన్స్టాలో ఫన్నీగా రియా క్షన్ ఇచ్చింది.

సోనాక్షి భర్త జహీర్ ఇక్బాల్ కూడా దీపావళి పార్టీలో ఫోటోలకు పోజులిచ్చేటప్పుడు, సోనాక్షి పొట్టపై చేయి వేసి "జాగ్రత్తగా ఉండు" అంటూ చమత్కరించారు. ఆ తర్వాత అది కేవలం జోక్ అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లి తర్వాత కొద్దిగా బరువు పెరగడం వల్లనే తాను బొద్దుగా కనిపిస్తున్నానని, అంతే తప్ప ప్రెగ్నెంట్ కాదని సోనాక్షి గతంలోనే స్పష్టం చేశారు.కాగా.. 'డబుల్ ఎక్స్ ఎల్' సినిమాలో నటించిన ఇక్బాల్ - సోనాక్షి గతేడాది జూన్ 23న పెండ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News