The He-Man Dharmendra: బాలీవుడ్ లెజెండ్..హీ మ్యాన్ ధర్మేంద్ర
హీ మ్యాన్ ధర్మేంద్ర
The He-Man Dharmendra: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులలో ఒకరు. తన సుదీర్ఘ కెరీర్‌లో రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా 'హీ-మ్యాన్'గా ఆయన పేరు పొందారు. దురదృష్టవశాత్తూ,నవంబర్ 24న 89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ కృష్ణ డియోల్ ,1935 డిసెంబర్ 8 పంజాబ్ లో జన్మించారు. సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్, అహానా డియోల్ సంతానం.
సినీ ప్రస్థానం & విజయాలు
మొదట్లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1960లో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరే' తో కెరీర్ ప్రారంభించి, 'షోలా ఔర్ షబ్నమ్' తో మొదటి విజయాన్ని అందుకున్నారు.1966లో వచ్చిన 'ఫూల్ ఔర్ పత్తర్' సినిమా ఆయనను పూర్తిస్థాయి యాక్షన్ సూపర్‌స్టార్‌గా నిలబెట్టింది.1975లో వచ్చిన 'షోలే' (Veeru పాత్ర) భారతీయ సినీ చరిత్రలో ఒక ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో ఆయన స్నేహం అద్భుతంగా పండింది.'సీతా ఔర్ గీత', 'చుప్కే చుప్కే' (కామెడీలో), 'మేరా గాఁవ్ మేరా దేశ్', 'ధరమ్ వీర్', 'యమ్లా పగ్లా దీవానా' వంటి సినిమాల్లో నటించారు. 60 ఏళ్ళకు పైగా సినీ ప్రస్థానంలో 300కు పైగా సినిమాల్లో నటించారు.
ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (1997), భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ పురస్కారం (2012), నటనతో పాటు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండి, 2004లో బీజేపీ తరపున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు.