Jr. NTR’s New Avatar: ఇది బాక్సాఫీస్ బాడీ.. తారక్ కొత్త లుక్ వైరల్

తారక్ కొత్త లుక్ వైరల్

Update: 2026-04-13 07:15 GMT

Jr. NTR’s New Avatar: సినిమా ఏదైనా.. పాత్ర ఏదైనా.. ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడం 'యంగ్ టైగర్' ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య! తారక్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చిందంటే అది కేవలం రికార్డుల కోసమే కాదు, అభిమానుల గుండెల్లో పూనకాలు తెప్పించడానికి కూడా! తాజాగా ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న తారక్, తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ కోసం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నారు. కఠినమైన జిమ్ కసరత్తులు చేస్తూ, చెమట చిందిస్తూ.. కండలు తిరిగిన శరీరంతో ఆయన్ని చూస్తుంటే.. 'టైగర్ ఈజ్ బ్యాక్' అన్న రేంజ్‌లో ఉంది ఆ లుక్. ఆ బైసెప్స్, ఆ పర్ఫెక్ట్ కట్ బాడీని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నటనలోనే కాదు, ఫిజిక్ విషయంలోనూ తారక్ ఎప్పుడూ కాంప్రమైజ్ కారని ఈ ఫోటో మరోసారి ప్రూవ్ చేసింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలల్లో కామెంట్లతో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ డెడికేషన్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే.. నందమూరి అభిమానులు మాత్రం ఒకే మాట అంటున్నారు.. "ఇది తారక్ బాడీ కాదు.. బాక్సాఫీస్ బాడీ!" అని. అంటే, ఈ లుక్‌తో రాబోయే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో ఇప్పుడే అర్థమైపోతోంది.రాజమౌళి 'RRR' తర్వాత తారక్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు 'డ్రాగన్' తో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు మార్చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ కసి, ఆ పట్టుదల తారక్ కళ్ళల్లో కనిపిస్తోంది.

Tags:    

Similar News