Bronze Statue of Shah Rukh Khan and Kajol Unveiled in London: 30 ఏళ్ల ప్రేమకథకు అరుదైన గౌరవం.. లండన్‌లో షారూఖ్,కాజోల్ కాంస్య విగ్రహం
లండన్‌లో షారూఖ్,కాజోల్ కాంస్య విగ్రహం
Bronze Statue of Shah Rukh Khan and Kajol Unveiled in London: బాలీవుడ్ హిట్ మూవీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) సినిమాకు సంబంధించి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారూఖ్ ఖాన్ ,కాజోల్ తమ ఐకానిక్ సినిమా 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే'30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లండన్‌లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. లండన్‌లోని ప్రసిద్ధ లీసెస్టర్ స్క్వేర్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. విగ్రహం షారూఖ్ (రాజ్ పాత్ర), కాజోల్ (సిమ్రాన్ పాత్ర)లను పోలిన బొమ్మలు, వారిద్దరూ కలిసి 'మెహందీ లగా కే రఖ్‌నా' పాటలోని ఐకానిక్ డ్యాన్స్ యాంగిల్ కనిపిస్తారు.
ఈ విగ్రహం లీసెస్టర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన 'సీన్స్ ఇన్ ది స్క్వేర్' అనే ప్రముఖ సినీ పాత్రల పబ్లిక్ ఆర్ట్ ట్రైల్‌లో భాగమైంది. ఇందులో హ్యారీ పాటర్, బ్యాట్‌మాన్, మేరీ పాపిన్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత పాత్రల విగ్రహాల సరసన రాజ్-సిమ్రాన్‌ల విగ్రహం నిలబడింది. ఈ విగ్రహాన్ని షారూఖ్ ఖాన్ , కాజోల్ డిసెంబర్ 4న (వీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే 30వ వార్షికోత్సవం సందర్భంగా) స్వయంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాజోల్ పిల్లలు నైసా, యుగ్ కూడా పాల్గొన్నారు.వీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా వారసత్వాన్ని, ప్రేమ కథల ప్రభావాన్ని చాటిచెప్పడంలో ఈ విగ్రహం ఒక మైలురాయిగా నిలిచింది.