Bunny Vasu’s Key Comments: సినీ కార్మికులు వేతనాల పెంపుపై..బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు
బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు;
Bunny Vasu’s Key Comments: సినిమా కార్మికుల వేతనాల పెంపు విషయంలో బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయంపై స్పందిస్తూ .. సినీ కార్మికులు వేతనాలను పెంచాలని అడగడం న్యాయమే అని బన్నీ వాసు అంగీకరించారు. గత మూడేళ్లుగా వారికి వేతనాలు పెంచలేదు కాబట్టి ఇప్పుడు పెంపు అవసరమని అన్నారు. అయితే కార్మికులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఏకంగా 30 శాతం వేతనాలు పెంచడం అనేది చాలా ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకేసారి అంత మొత్తం పెంచితే చిన్న, మధ్యస్థ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
ఈ సందర్భంగా చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. ఒక చిన్న సినిమా తీయాలంటే దాదాపు రూ. 12-13 కోట్లు బడ్జెట్ అవుతోందని, ఇందులో నటీనటులు , ఇతర డిపార్ట్‌మెంట్లకు చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన అన్నారు.ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని కమిటీలు పనిచేస్తున్నాయని, మరో రెండు మూడు రోజుల్లో దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అంగీకరించినప్పటికీ, కేవలం పది-పన్నెండు సినిమాల విజయంతో మొత్తం పరిశ్రమ ఆదాయాన్ని లెక్కించలేమని ఆయన స్పష్టం చేశారు. చాలా సినిమాలు నష్టాలతో నడుస్తున్నాయని కూడా ఆయన అన్నారు. బన్నీ వాసు చెప్పిన విషయాలు కార్మికుల డిమాండ్లను పాక్షికంగా అంగీకరిస్తూనే, నిర్మాతల వైపు ఉన్న ఇబ్బందులను చెప్పారు.