C. Kalyan Demands Capital Punishment for iBomma Ravi: ఐబొమ్మ రవిని ఉరి తీయాలి: సి. కళ్యాణ్
రవిని ఉరి తీయాలి: సి. కళ్యాణ్
C. Kalyan Demands Capital Punishment for iBomma Ravi: ఐబొమ్మ వెబ్‌సైట్ వ్యవహారంపై నిర్మాత సీ. కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందించారు. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడైన రవిని ఉరి తీయాలని ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్‌సైట్‌ల ద్వారా తమ సినిమాలు అక్రమంగా విడుదల కావడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని సీ. కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైరసీ కారణంగా సినీ పరిశ్రమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని, నిర్మాతలు తీవ్రమైన ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు అరెస్ట్ సమయంలో గంటన్నరపాటు ఐ-బొమ్మ రవి ఇంటి తలుపులు తెరవలేదని పోలీసులు తెలిపారు. తాము వచ్చింది చూసి టెలిగ్రామ్, మొబైల్ డేటాను క్లియర్ చేశాడని చెప్పారు. ల్యాప్‌టాప్‌ను బాత్‌రూమ్ రూఫ్ కింద, సెల్‌ఫోన్‌ను అల్మారాలో దాచినట్లు వివరించారు. అటు పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. స్నేహితులు, బంధువులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నాడు రవి.
ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. నగదు బదిలీలపై దర్యాప్తు చేయడానికి హైదరాబాద్ సీపీకి ED లేఖ రాసింది. రవి తన క్రిప్టోకరెన్సీ వాలెట్‌లు, విదేశీ బ్యాంకు అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులను తన NRE ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు రవికి చెందిన దాదాపు రూ. 5 కోట్లు ఉన్న అకౌంట్‌లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.