Hero Chandrahass: బరాబర్​ప్రేమిస్తా హీరో చంద్రహాస్​పై కేసు

హీరో చంద్రహాస్​పై కేసు

Update: 2026-02-05 04:55 GMT

Hero Chandrahass: సినీహీరో, అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చిక్కల్లో పడ్డాడు. ఇటీవల జరిగిన తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్​లో బూతు పదాలతో పాట పాడడంతో చంద్రహాస్ తీరుపై సినీ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ విషయంలో ఓ వ్యక్తిని చంద్రహాస్ బెదిరింపులకు గురిచేయడంతో మాదాపూర్ పీఎస్​లో చంద్రహాస్‌‌పై కేసు నమోదైంది. మాదాపూర్ ఇన్​స్పెక్టర్ కృష్ణమోహన్ వివరాల ప్రకారం.. ఈటీవీ ప్రభాకర్ కొడుకు, అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జూబ్లీహిలస్​లోని దస్పల్లా హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్​లో “గుంజీ గుంజీ” అంటూ సాగే పాటను చంద్రహాస్ బూతులతో పాడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఓ టీవీ చానెల్ ఎడిటర్ అశోక్​కుమార్ స్పందించి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోపై స్పందించి చంద్రహాస్ తనను బెదిరింపులకు గురిచేశాడని అశోక్​కుమార్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రహాస్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News