Centre Gives Shock to Dhurandhar:ధురంధర్‌కు కేంద్రం షాక్.. ఆ పదాలపై సెన్సార్ కత్తెర..

ఆ పదాలపై సెన్సార్ కత్తెర..

Update: 2026-01-02 09:24 GMT

Centre Gives Shock to Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న ధురంధర్ చిత్రంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాజకీయ, సామాజిక సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రంలోని కొన్ని వివాదాస్పద పదాలను తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కేంద్రం సూచనల మేరకు చిత్ర బృందం సినిమాలోని కొన్ని డైలాగులను మార్చింది. ఈ మేరకు డిసెంబర్ 31న డిస్ట్రిబ్యూటర్లు అన్ని థియేటర్లకు సమాచారం అందించారు. పాత ప్రింట్‌ను తొలగించి, మార్పులు చేసిన కొత్త డిజిటల్ సినిమా ప్యాకేజీని జనవరి 1 నుండి ప్రదర్శిస్తున్నారు.

మ్యూట్ చేసిన పదాలు

ఈ చిత్రంలో ప్రధానంగా పాకిస్థాన్‌కు సంబంధించిన బలోచ్ అనే పదాన్ని మ్యూట్ చేశారు. దీంతో పాటు మరొక పదం, ఒక డైలాగ్‌ను కూడా సెన్సార్ నిబంధనల ప్రకారం మార్చినట్లు సమాచారం.

భారీ తారాగణం - వాస్తవ నేపథ్యం:

ఉరి చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా.. పాకిస్థాన్‌లోని సామాజిక ఘర్షణలు, ఉగ్రవాదం, అక్కడి ప్రభుత్వ తీరుపై సాగుతుంది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా 'ధురంధర్' ఇప్పటికే నిలిచింది. వివాదాస్పద అంశాలను తొలగించినప్పటికీ, సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News