Remake the Classic ‘Hello Brother’!: నాగార్జున క్లాసిక్ హిట్ 'హలో బ్రదర్' సినిమాను రీమేక్ చేయడానికి నాగచైతన్య, అఖిల్ అక్కినేని ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో అక్కినేని తండ్రీకొడుకులు తమ కెరీర్, జీవితం, ఒకరికొకరు ఉన్న అనుబంధం గురించి ముచ్చటించారు.

నాగచైతన్య, అఖిల్ కలసి ఇప్పటివరకు పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమాలో నటించలేదు. గతంలో నాగార్జున, దివంగత అక్కినేని నాగేశ్వరరావుగారితో కలసి 'మనం' సినిమాలో మాత్రమే వీరు కనిపించారు. ఇంటర్వ్యూ సమయంలో "మీ నాన్నగారి సినిమాల్లో దేనిని రీమేక్ చేయాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించగా, ఇద్దరూ ఏకాభిప్రాయంతో 'హలో బ్రదర్' పేరు చెప్పారు.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' నాగార్జున కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్‌లలో ఒకటి. ఇందులో నాగార్జున కవల పిల్లలుగా ద్విపాత్రాభినయం చేయగా, రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా నటించారు. నాగచైతన్య తన తండ్రి నటించిన చిత్రాల్లో 'గీతాంజలి' కూడా తనకు బాగా ఇష్టమైన సినిమా అని తెలిపాడు.

ఇక ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే, అఖిల్ ఇటీవల 'లెనిన్' సినిమాతో విజయాన్ని అందుకోగా, నాగచైతన్య తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రం 'వృషకర్మ' విడుదలకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు నాగార్జున తన మైలురాయి చిత్రం 'కింగ్ 100' రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

Tags: