Pan India Star Prabhas: ప్రభాస్ మనసులో చెన్నై జ్ఞాపకాలు.. స్కూల్ రోజులను గుర్తుచేసుకున్న డార్లింగ్..

స్కూల్ రోజులను గుర్తుచేసుకున్న డార్లింగ్..

Update: 2026-02-20 12:57 GMT

Pan India Star Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన భారీ సినిమాలు, ఆతిథ్యం. అయితే, తాజాగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను పుట్టి పెరిగిన చెన్నై నగరంతో తనకున్న విడదీయలేని అనుబంధాన్ని ప్రభాస్ గుర్తుచేసుకున్నారు.

చెన్నై గల్లీల నుండి డాన్ బాస్కో స్కూల్ వరకు:

ఇటీవల ఘనవిజయం సాధించిన కపుల్ ఫ్రెండ్లీ చిత్ర బృందంతో ముచ్చటించిన ప్రభాస్, తన బాల్యం గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం చెన్నై నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ.. "నేను పుట్టింది చెన్నైలోనే. అక్కడి డాన్ బాస్కో స్కూల్ లోనే నా చదువు సాగింది. ఇప్పటికీ చెన్నై వెళ్లినప్పుడు నా పాత స్కూల్‌ను ఒకసారి చూస్తుంటాను. ఆ నగరం అంటే నాకెంతో ఇష్టం, అప్పుడప్పుడు అక్కడి రోజులను చాలా మిస్ అవుతుంటాను" అని ఎమోషనల్ అయ్యారు.

తమిళం మర్చిపోయినా.. మళ్లీ ఎలా దొరికిందంటే?

హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన తర్వాత తాను తమిళ భాషను దాదాపుగా మర్చిపోయానని ప్రభాస్ తెలిపారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలోని రాజు మాస్టర్, ప్రభు మాస్టర్ వంటి టెక్నీషియన్లతో నిత్యం మాట్లాడుతూ ఉండటం వల్లే తన తమిళం మళ్లీ మెరుగైందని ఆయన చెప్పుకొచ్చారు.

కపుల్ ఫ్రెండ్లీ విశేషాలు..

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్ ను నిర్మించింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక జంట ఎదుర్కొనే పరిణామాల చుట్టూ ఈ కథ సాగుతుంది. అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పించింది.

గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా తన మూలాలను, చిన్ననాటి జ్ఞాపకాలను ప్రభాస్ మర్చిపోలేదని ఈ సంభాషణ ద్వారా మరోసారి స్పష్టమైంది. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News