Chiranjeevi Falls Victim to Deepfake: డీప్ ఫేక్ బారిన చిరంజీవి..AI తో అశ్లీల వీడియోలు..

AI తో అశ్లీల వీడియోలు..

Update: 2025-10-27 07:09 GMT

Chiranjeevi Falls Victim to Deepfake: ౦ 

.నటుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు. కొంతమంది దుండగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. తన పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇటీవల చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి, తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, బిరుదులు, వాయిస్, ఇతర గుర్తింపు చిహ్నాలను వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించకుండా నిరోధించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు (Interim Injunction) జారీ చేసింది.

30కి పైగా ఆన్‌లైన్ సంస్థలు (యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా, ఈ-కామర్స్ స్టోర్‌లు మొదలైనవి) చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్, అలాగే 'మెగాస్టార్', 'చిరు', 'అన్నయ్య' వంటి బిరుదులను ఆయన అనుమతి లేకుండా వాడకూడదు అని ఆదేశించింది.

ముఖ్యంగా AI ఆధారిత వీడియోల్లో, డీప్‌ఫేక్‌లలో ఆయన రూపాన్ని ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఈ ఉత్తర్వు ద్వారా చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొంది.

Tags:    

Similar News