Chiranjeevi Files Complaint: మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు

సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు

Update: 2025-10-29 08:23 GMT

Chiranjeevi Files Complaint: మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియాలో (ముఖ్యంగా 'X' హ్యాండిల్స్ ద్వారా) అభ్యంతరకరమైన ,అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చిరంజీవి పేర్కొన్నారు.దయా చౌదరి అనే వ్యక్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేశారు.

తన పేరు, ఇమేజ్, వాయిస్‌ను దుర్వినియోగం చేయకూడదని సిటీ సివిల్ కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చినా, కొందరు వాటిని ఉల్లంఘిస్తూ ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు.

ఇటీవల, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి డీప్‌ఫేక్ అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని చిరంజీవి గతంలోనూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ప్రస్తుతం, పోలీసులు చిరంజీవి ఇచ్చిన ఈ తాజా ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News