Chiranjeevi Undergoes Surger: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ..కోలుకుంటున్నానంటూ పోస్ట్

కోలుకుంటున్నానంటూ పోస్ట్

Update: 2026-02-17 02:32 GMT

Chiranjeevi Undergoes Surger: మెగాస్టార్ చిరంజీవి తనకు షోల్డర్ కీ-హోల్ సర్జరీ (Shoulder Keyhole Surgery) జరిగినట్లు అధికారికంగా ధృవీకరించారు. గత కొద్ది రోజులుగా ఆయన చేతికి పట్టీ (Arm Sling) ఉండటంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు ఆయన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు." నా భుజానికి చిన్న సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నాను, ఇప్పటికే నా దినచర్యను మళ్ళీ మొదలుపెట్టాను"నాకు చికిత్స చేసిన డాక్టర్ నితిన్‌కు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, దీవెనలకు నేను ఎంతో రుణపడి ఉంటాను అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్రముఖ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ ఆధ్వర్యంలో చిరంజీవికి ఈ శస్త్రచికిత్స జరిగింది. షోల్డర్‌కు సంబంధించిన ఒక చిన్న సమస్య వల్ల ఈ కీ-హోల్ సర్జరీ అవసరమైంది. ఇటీవల ఆయన నటించిన భారీ యాక్షన్ చిత్రాల షూటింగ్స్ వల్ల ఈ ఒత్తిడి తలెత్తినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ వివాహ ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందించినప్పుడు, ఆయన చేతికి కట్టు ఉండటాన్ని అభిమానులు గమనించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవి స్వయంగా స్పందించాల్సి వచ్చింది.

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు బాబీ (Bobby Kolli) తో చిరంజీవి మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సర్జరీ బ్రేక్ తర్వాత ఆయన మళ్ళీ మేకప్ వేసుకోనున్నారు.ఇటీవల సంక్రాంతికి విడుదలైన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News