Choreographer Fires at Priyanka: అందం ఉంటే సరిపోదు.. డ్యాన్స్ రావాల్సిందే.. ప్రియాంకపై ఆ కొరియోగ్రాఫర్ ఫైర్
ప్రియాంకపై ఆ కొరియోగ్రాఫర్ ఫైర్
Choreographer Fires at Priyanka: గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా, వెండితెరపై తన డ్యాన్స్‌తో ఎంతోమందిని అలరించారు. అయితే కెరీర్ తొలినాళ్లలో డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆమె పడిన ఇబ్బందులను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా ఒక కొరియోగ్రాఫర్ చేసిన విమర్శ ఆమెలో ఎలా పట్టుదలను పెంచిందో వివరించారు.
కొరియోగ్రాఫర్ ఆగ్రహం.. పట్టుదలగా నేర్చుకున్న వైనం..
సౌత్ ఆఫ్రికాలో ఒక షూటింగ్ సమయంలో, స్టెప్స్ సరిగా వేయలేకపోవడంతో కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "అందంగా ఉంటే సరిపోదు, నటిగా రాణించాలంటే డ్యాన్స్ కూడా రావాలి" అని అందరి ముందే మైక్ విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఆ సంఘటనతో కృంగిపోకుండా, పట్టుదలతో రోజుకు ఆరు గంటల పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినట్లు ప్రియాంక తెలిపారు. ఆ సమయంలో నటి కత్రినా కైఫ్‌తో కలిసి తాను శిక్షణ తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.
వారణాసిలో రాజమౌళికి ప్రియాంక రిక్వెస్ట్..
ప్రస్తుతం ప్రియాంక చోప్రా భారీ ప్రాజెక్టుతో ఇండియన్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ప్రియాంక నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాటు నాటు రేంజ్‌లో ఒక పవర్‌ఫుల్ డ్యాన్స్ సాంగ్ ఉండేలా చూడాలని తాను రాజమౌళిని కోరినట్లు ఆమె వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.