Harish Shankar Clarifies: సినిమా వేరు.. రాజకీయం వేరు.. ఉస్తాద్ భగత్ సింగ్ వివాదంపై హరీష్ శంకర్ క్లారిటీ

ఉస్తాద్ భగత్ సింగ్ వివాదంపై హరీష్ శంకర్ క్లారిటీ

Update: 2026-02-24 03:09 GMT

Harish Shankar Clarifies: పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా నుంచి తాజాగా విడుదలైన "ఆరా ఆఫ్ ఉస్తాద్" (Aura of Ustaad) పాట చూసి, ఇందులో రాజకీయ విమర్శలు ఉండబోతున్నాయని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ ఒక వీడియో స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఏ రాజకీయ పార్టీని గానీ, ఏ వ్యక్తిని గానీ టార్గెట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు: సినిమా ప్రారంభమైన రోజే పవన్ కళ్యాణ్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారట. "సినిమా వేరు, రాజకీయం వేరు.. రెండింటినీ కలపొద్దు. సినిమా అనేది కేవలం వినోదం కోసమే ఉండాలి" అని పవన్ గట్టిగా సూచించినట్లు హరీష్ తెలిపారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు, ప్రకాష్ రాజ్‌కు మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, వాటిని సినిమా దగ్గరికి రానివ్వలేదని హరీష్ గుర్తు చేశారు. 'వకీల్ సాబ్'లో అలాగే చేశారు, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌కు అన్ని రాజకీయ పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారని, ఎవరినీ నొప్పించకుండా ఈ సినిమాను కేవలం ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దామని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. కేవలం పవన్ మేనరిజమ్స్, ఎలివేషన్ల కోసమే డైలాగులు ఉంటాయని, అవి ఎవరినీ ఉద్దేశించినవి కాదని క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ కూడా పొలిటికల్ డైలాగులు వద్దని తనను కోరారని, వారి కోరిక మేరకే సినిమా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మార్చి 26, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఈ క్లారిటీతో రూమర్లకు తెరపడినట్లయింది.

Tags:    

Similar News