Clinkara: హైదరాబాద్ జూ పార్క్ లో క్లింకార..చూసేయండి
జూ పార్క్ లో క్లింకార..చూసేయండి;
Clinkara: ఇవాళ రామ్ చరణ్ ఉపాసన గారాల పట్టి క్లీంకార సెకండ్ బర్త్ డే సందర్భంగా ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. క్లీంకారతో ఉపాసన నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను సందర్శించింది. జూలో వైట్ టైగర్తో దిగిన ఓ ఫోటోను పంచుకుంటూ ఉపాసన ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ఈ తెల్లపులికి, తన కూతురు క్లీంకార పేరును పెట్టినట్లు పోస్ట్లో వెల్లడించింది. “సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి. నేడు, అది ఒక ఉల్లాసభరితమైన పులి. హైదరాబాద్ జూ పార్క్ యాజమాన్యానికి ధన్యవాదాలు అని ఉపాసన తెలిపింది.
క్లీంకార మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టి రెండేళ్లు అయినప్పటికీ.. ఆమె ఫేస్ని రివీల్ చేయలేదు. తాను పూర్తిగా ఎలా ఉందొ తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, అదిప్పటికీ జరగలేదు. అయితే, లేటెస్ట్ ఫొటోలో మాత్రం గతంలో కంటే ఇప్పుడు పర్లేదు అన్నంతగా క్లీంకార కనిపిస్తుంది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్లింకార కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.