'Cocktail 2' movie: కృతి సనన్ తో రష్మిక రొమాన్స్.?
రష్మిక రొమాన్స్.?
'Cocktail 2' movie: సినిమా రంగంలో తనకుంటూ ఓపేరుతెచ్చుకున్న నటి రష్మిక మందన్న పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి నిరూపించుకునే మల్టీటాలెంటెడ్ భామ. ఇప్పుడు ఆమె తర్వాత ప్రాజెక్టు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రానున్న 'కాక్స్టెయిల్ 2' సినిమాలో కృతి సనన్ తో పాటు, రష్మిక కీలక పాత్రల్లో సటిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ మూవీలో వీరి పాత్రలపై బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్త అందరినీ ఆశ్చరానికి గురుచేస్తుంది. ఈ చిత్రంలో కృతి, రష్మిక లెస్బియన్ లవర్స్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ వీరి పాత్రల గురించి ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. హోమీ అదజానియా దర్శక త్వంలో కాక్టెయిల్ 2' రానుంది. జనవరి 31న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు టీమ్ తెలిపింది.
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రష్మిక,విజయ దేవర కొండ పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో జరగబోతుందని సమాచారం. ఫిబ్రవరి 24న హల్దీ, 25న సంగీత్ వేడుకలు జరగనున్నాయి.: మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.