Court Shock to Actor Vishal: నటుడు విశాల్‌కు కోర్టు షాక్: రూ.10 కోట్ల డిపాజిట్‌కు గడువు నిరాకరణ..
రూ.10 కోట్ల డిపాజిట్‌కు గడువు నిరాకరణ..
Court Shock to Actor Vishal: ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో గత కొంతకాలంగా సాగుతున్న రుణ వివాదం కేసులో ఆయన విన్నపాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు ఆదేశించిన రూ.10 కోట్ల డిపాజిట్ మొత్తాన్ని చెల్లించేందుకు అదనపు గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
అసలేమిటి ఈ వివాదం?
గతంలో విశాల్ తన నిర్మాణ సంస్థ కోసం లైకా ప్రొడక్షన్స్ నుండి తీసుకున్న అప్పు వివాదానికి దారితీసింది. విశాల్ దాదాపు రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి లైకాకు చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై స్టే కోరుతూ విశాల్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, రూ.10 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలనే షరతుతో స్టే మంజూరైంది.
గడువు పొడిగింపునకు నో చెప్పిన ధర్మాసనం
మంగళవారం జరిగిన విచారణలో విశాల్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. విశాల్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం వల్ల నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో ఆరు వారాల సమయం కావాలని కోరారు. అయితే, జస్టిస్ సి.వి.కార్తికేయన్ మరియు జస్టిస్ కె.కుమరేష్ బాబులతో కూడిన ధర్మాసనం ఈ వాదనను ఏకీభవించలేదు. ఇప్పటికే ఎనిమిది వారాల సమయం ఇచ్చామని, ఇకపై గడువు పొడిగించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. విశాల్ దాఖలు చేసిన గడువు పొడిగింపు పిటిషన్‌ను కొట్టివేసింది.
విశాల్‌కు ఎదురయ్యే పరిణామాలు
కోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో, సింగిల్ జడ్జి ఇచ్చిన పాత తీర్పు మళ్ళీ అమల్లోకి రానుంది. దీని ఫలితంగా లైకా ప్రొడక్షన్స్ తన అప్పును వసూలు చేసుకునేందుకు చట్టపరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. విశాల్ సినిమాల విడుదల లేదా ఇతర ఆస్తులపై మళ్ళీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.