Dandora: కొత్త ఏడాదంతా మాట్లాడుకునే సినిమా దండోరా

సినిమా దండోరా

Update: 2025-12-27 05:44 GMT

Dandora: శివాజీ, న‌‌‌‌వ‌‌‌‌దీప్‌‌‌‌, నందు, ర‌‌‌‌వికృష్ణ, బిందు మాధ‌‌‌‌వి లీడ్ రోల్స్‌‌‌‌లో మురళీకాంత్ తెరకెక్కించిన చిత్రం ‘దండోరా’. ర‌‌‌‌వీంద్ర బెన‌‌‌‌ర్జీ ముప్పానేని నిర్మించారు. గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు సక్సెస్‌‌‌‌ మీట్ నిర్వహించారు.

నటుడు శివాజీ మాట్లాడుతూ ‘ఓవర్సీస్‌‌‌‌తో సహా అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు మురళీకాంత్‌‌‌‌ను మారి సెల్వరాజ్‌‌‌‌ లాంటి తమిళ దర్శకులు, మలయాళ దర్శకులతో పోల్చడం మాకెంతో గర్వంగా ఉంది. ప్రతి పాత్ర బాగా కుదిరింది. అందరం ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు’ అని చెప్పారు. సినిమా చూసిన త‌‌‌‌ర్వాత యునానిమ‌‌‌‌స్‌‌‌‌గా సినిమా బావుంద‌‌‌ని అంద‌‌‌‌ అంటున్నారని, మంచి సినిమా తీశామ‌‌‌ని మేమేదైతే చెప్పామో.. ఆ ధైర్యం ఇప్పుడు డ‌‌‌బుల్ అయ్యిందని నవదీప్‌‌‌‌ అన్నారు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని అన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌‌‌‌.. ఈ సినిమా కోసం పడ్డ మూడున్నరేళ్ల కష్టం మరిచిపోయేలా చేసిందని దర్శకుడు మురళీకాంత్ చెప్పారు. బిందు మాధ‌‌‌‌వి, రవికృష్ణ, మౌనిక, మణిక, అదితి భావరాజు, కమల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News