“Darling” Re-Release Storm: గబ్బర్ సింగ్, ఖలేజా రికార్డులు క్లీన్ స్వీప్..రీ రిలీజ్ లో డార్లింగ్ ఊచకోత!
రీ రిలీజ్ లో డార్లింగ్ ఊచకోత!
“Darling” Re-Release Storm: ఒక్కసారి డార్లింగ్ అంటే.. అది కేవలం పిలుపు మాత్రమే కాదు, ఒక ఎమోషన్! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్యూట్ డైరెక్టర్ కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ 'డార్లింగ్'. 16 ఏళ్ల క్రితం థియేటర్లలో ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు దశాబ్దన్నర కాలం తర్వాత కూడా అదే మ్యాజిక్, అదే క్రేజ్ రిపీట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు.
రీ-రిలీజ్ ట్రెండ్‌లో ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమా రీ-రిలీజ్ అయిన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.7.59 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుంటే, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వసూళ్లతో 'డార్లింగ్' ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ రీ-రిలీజ్ రికార్డుల్లో పవన్ కళ్యాణ్ మాస్ సెన్సేషన్ ‘గబ్బర్ సింగ్’, మహేశ్ బాబు కల్ట్ క్లాసిక్ ‘ఖలేజా’ చిత్రాల రికార్డులను డార్లింగ్ మట్టికరిపించింది. ప్రస్తుతానికి టాలీవుడ్ రీ-రిలీజ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రభాస్ క్రేజ్ ముందు రికార్డులు కూడా తలవంచాల్సిందే అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.
అయితే ఇక్కడ విశేషం ఏంటో తెలుసా? డార్లింగ్ రెండో స్థానంలో ఉంటే.. మొదటి స్థానంలో ఉంది కూడా ప్రభాస్ సినిమానే! ఇండియన్ సినిమా గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి: ది ఎపిక్’ రీ-రిలీజ్ సమయంలో తొలిరోజే రూ.19.65 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంటే, టాలీవుడ్ రీ-రిలీజ్ చార్ట్స్‌లో మొదటి రెండు స్థానాలూ ప్రభాస్ ఖాతాలోనే ఉండటం ఆయన గ్లోబల్ స్టార్‌డమ్‌కి నిదర్శనం.