Mrunal Thakur: ధనుష్‌తో డేటింగ్ .. మృణాల్ ఠాకూర్ క్లారిటీ !

మృణాల్ ఠాకూర్ క్లారిటీ !;

Update: 2025-08-12 04:48 GMT

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్, ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలపై స్పందించారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్‌లో ధనుష్, మృణాల్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, చనువుగా మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్ తన స్వంత సినిమాల ప్రచారం తప్ప వేరే కార్యక్రమాలకు హాజరు కావడం అరుదు. అయితే, మృణాల్ కొత్త సినిమా స్క్రీనింగ్‌కు ఆయన ప్రత్యేకంగా ముంబైకి వెళ్లడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ అక్కలైన డాక్టర్ కార్తీక కార్తీక్, విమల గీతలను ఫాలో అవడం, వారు కూడా మృణాల్‌ను ఫాలో అవడం ఈ వార్తలను మరింత పెంచింది. దీనితో ధనుష్ తన కుటుంబాన్ని మృణాల్‌కి పరిచయం చేశారని చాలామంది భావించారు. 2023లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్, ధనుష్ తన "అత్యంత ఇష్టమైన నటుడు" అని చెప్పిన వీడియో కూడా మళ్లీ వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ పుకార్లపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ, ధనుష్‌తో తాను డేటింగ్ చేయడం లేదని, ఆయన తనకు కేవలం "మంచి స్నేహితుడు" అని తెలిపారు. 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌కు ధనుష్, అజయ్ దేవగణ్ ఆహ్వానం మేరకే వచ్చారని వివరించారు. ఈ వార్తలను చూసి నవ్వుకున్నానని, తాను ఇంకా కెరీర్‌లో ఎదగాలని కోరుకుంటున్నానని, వ్యక్తిగత విషయాలపై ఇప్పుడే దృష్టి పెట్టడం లేదని ఆమె చెప్పారు. 'నజర్' తగలడం ఇష్టం లేనందున తన ప్రణాళికల గురించి బయటపెట్టనని తెలిపారు. అయితే, కొన్ని మీడియా వర్గాల ప్రకారం.. మృణాల్, ధనుష్ మధ్య సంబంధం ఉందని, కానీ వారు దీనిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నాయి. ఈ ఇద్దరూ తమ విలువలు, ఆలోచనలలో చాలా దగ్గరగా ఉన్నారని, అందుకే వారి స్నేహితులు ఈ బంధానికి మద్దతుగా ఉన్నారని కొన్ని నివేదికలు తెలిపాయి. కాగా, ధనుష్ తన మొదటి భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో 2024లో విడాకులు తీసుకున్నారు.

Tags:    

Similar News