‘Decoy’ Teaser: కన్నెపిట్టరో కన్నుకొట్టరో సాంగ్ తో డెకాయిట్ టీజర్
డెకాయిట్ టీజర్
‘Decoy’ Teaser: అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డెకాయిట్' (Dacoit) టీజర్ నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా అడవి శేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీజర్‌లో నాగార్జున నటించిన 'హలో బ్రదర్'లోని సూపర్ హిట్ సాంగ్ "కన్నెపిట్టరో కన్నుకొట్టరో" ట్యూన్‌ను రీమిక్స్ చేసి వాడారు. దీని గురించి చెబుతూ.. "నాగార్జున పర్మిషన్ తీసుకుని ఈ సాంగ్‌ను వాడాము. ఇది టీజర్‌కు ఒక కొత్త వైబ్ ఇచ్చింది" అని శేష్ తెలిపారు.నాగార్జున తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు .
ఈ సినిమా 2026 మార్చి 19న (ఉగాది సందర్భంగా) విడుదల కానుంది. అదే సమయంలో యశ్ నటించిన 'టాక్సిక్', రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ శేష్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. సముద్రంలో చాలా పెద్ద చేపలు ఉండొచ్చు, కానీ మేము గోల్డ్ ఫిష్‌లం ,. మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది."గతంలో తన 'మేజర్' సినిమా కమల్ హాసన్ 'విక్రమ్', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాలతో పోటీపడి విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఇందులో అయ్యప్ప భక్తుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది కేవలం ఒక దొంగతనం (Heist) డ్రామా మాత్రమే కాదని, ఒక వైలెంట్ లవ్ స్టోరీ అని శేష్ స్పష్టం చేశారు. 'హరి' 'జూలియట్' అనే ఇద్దరు ప్రేమికులు ఎలా శత్రువులుగా మారారు అనేదే మెయిన్ పాయింట్. ఈ సినిమా 2026, మార్చి 19న తెలుగు , హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.