Chandrahas Makes Sensational Comments: ట్రోల్స్ గురించి పట్టించుకోను.. చంద్రహాస్ సంచలన కామెంట్స్

చంద్రహాస్ సంచలన కామెంట్స్

Update: 2026-02-02 07:03 GMT

Chandrahas Makes Sensational Comments: సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చంద్రహాస్, తను నటించిన తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో చంద్రహాస్ మాట్లాడుతూ తనపై వచ్చే ట్రోల్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “నేను నా పనిని ఎంతో నిజాయితీగా చేసుకుపోతాను, ట్రోల్స్ గురించి లేదా నెగటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోను, అవి నన్ను ఇబ్బంది పెట్టలేవు” అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆది సాయికుమార్, జేడీ చక్రవర్తి, జయంత్ సి పరాంజీలకు చంద్రహాస్ కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా ఆది సాయికుమార్ తనకు ఇన్సిపిరేషన్ అని, ఆయన హార్డ్ వర్క్ చూసి తాను చాలా నేర్చుకుంటానని చెప్పాడు. అలాగే తన తండ్రి ప్రభాకర్ గురించి మాట్లాడుతూ చంద్రహాస్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తండ్రి అని, ఆయన వల్లే ఇక్కడ నిలబడగలుగుతున్నానని ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఇక సినిమా విషయానికొస్తే, ఇందులో చాలా ఊహించని ట్విస్టులు ఉంటాయని, క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

సినిమాలోని పాటలు ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించాయని, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడని కొనియాడాడు. హీరోయిన్ మేఘనా ముఖర్జీ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వస్తాయని జోస్యం చెప్పాడు. తనను స్క్రీన్ మీద చాలా బాగా చూపించినందుకు దర్శకుడికి, సినిమా కోసం ఎక్కడా వెనకాడకుండా ఖర్చు చేసిన నిర్మాతలకు థాంక్స్ చెప్పాడు. ‘బరాబర్ ప్రేమిస్తా’ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, అందరూ థియేటర్లలో చూసి తమ టీమ్‌ను సపోర్ట్ చేయాలని చంద్రహాస్ కోరాడు.

Tags:    

Similar News