Deepika Padukone: కల్కి-2 నుంచి దీపికా పదుకొణె ఔట్

దీపికా పదుకొణె ఔట్

Update: 2025-09-18 13:36 GMT

Deepika Padukone: రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. దీపిక స్థానంలో మరో ప్రముఖ నటిని తీసుకునే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో అభిమానుల్లో షాక్​కు గురవుతున్నారు. ఇంత భారీ పాన్ఇండియా ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకోవడం సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. మొదటి భాగం షూటింగ్ సమయంలోనే రెండో భాగం చిత్రీకరణకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, స్పిరిట్ మూవీలో దీపికా పదుకొణెకు బదులు త్రిప్తి డిమ్రిని తీసుకున్న విషం తెలిసిందే. కాగా, దీపికా పదుకొణె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News