Trisha Shares: '96' మూవీలో సింగర్ జానకమ్మ డిలీటెడ్ సీన్స్..త్రిష ఎమోషనల్ పోస్ట్

త్రిష ఎమోషనల్ పోస్ట్

Update: 2026-07-13 02:49 GMT

Trisha Shares: సినీ పరిశ్రమలో మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు కోట్ల మంది గుండెల్ని ఉర్రూతలూగించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకమ్మ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి త్రిష.. జానకమ్మతో తనకున్న ఒక అరుదైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అత్యంత భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

తమిళంలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన '96' సినిమా మనందరికీ గుర్తే. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో త్రిష పాత్ర పేరు 'జానకి'. అయితే ఈ చిత్రంలో అసలైన గాయని ఎస్. జానకమ్మ గారు ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారన్న విషయం చాలా మందికి తెలియదు. అవును.. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జానకమ్మపై ఒక చక్కటి సీన్ షూట్ చేశారు. కానీ, థియేటర్లలో విడుదల చేసే సమయంలో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ సన్నివేశాన్ని తొలగించారు. ఆ తర్వాత చిత్రబృందం ఈ డిలీటెడ్ సీన్‌ను యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేసింది.

జానకమ్మ మృతిపై స్పందిస్తూ త్రిష.. "నా కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన సినిమాలో మీ పేరు పెట్టుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం జానకమ్మ. మిమ్మల్ని కలవడం, మీ ప్రేమను పొందడం నా అదృష్టం. మీ ఆప్యాయత, ఆ చిరునవ్వును నేను ఎప్పటికీ మరువలేను. ఎంత గొప్ప కళాకారులైనా ఎంత సాధారణంగా ఉంటారో మీరు నిరూపించారు. మీరు భౌతికంగా దూరమైనా... మీ మధురమైన గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా జానకమ్మ. మీ ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ ఎమోషనల్ అయ్యారు.

Tags:    

Similar News