Dhanush & Mrunal Thakur Marriage Video: ధనుష్ – మృణాల్ ఠాకూర్ పెళ్లి వీడియో ఫేక్: కస్తూరి రాజా స్పష్టీకరణ
“ఇలాంటి వీడియో ఎలా పోస్ట్ చేస్తారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధనుష్ తండ్రి“
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధనుష్ – మృణాల్ ఠాకూర్ వివాహ వీడియో పూర్తిగా నకిలీదే అని ధనుష్ తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా స్పష్టంగా ఖండించారు.
ఈ వైరల్ వీడియోలో ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ సంప్రదాయ దక్షిణ భారతీయ వివాహ వేడుకలో పాల్గొన్నట్లు చూపించారు. అంతేకాదు, ఆ వీడియోలో థలపతి విజయ్, అజిత్ కుమార్ వంటి ప్రముఖ స్టార్లు కూడా హాజరైనట్లు చూపించడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది.
ఈ వీడియోను ఆధారంగా చేసుకుని, ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ జనవరి 22న చెన్నైలో వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. పలువురు సెలబ్రిటీలు కూడా అక్కడ ఉన్నారంటూ అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.
అయితే ఈ వార్తలన్నీ కేవలం వదంతులే అని స్పష్టం అయింది. ఇప్పటివరకు ధనుష్ కానీ, మృణాల్ ఠాకూర్ కానీ తమ మధ్య సంబంధం ఉందని గానీ, పెళ్లి గురించి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ధనుష్ – మృణాల్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా?
ఈ ప్రశ్నకు ధనుష్ తండ్రి కస్తూరి రాజా తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. ఆయన మాట్లాడుతూ,
“ఇలాంటి వీడియోను ఎవరు, ఎలా పోస్ట్ చేస్తారో మాకు అర్థం కావడం లేదు. ఈ వీడియో పూర్తిగా ఫేక్.
మా కుటుంబ సభ్యులకు ఇలాంటి విషయం ఏదీ తెలియదు.
ఇందులో ఏమాత్రం నిజం లేదు అని అయన ఖండించారు.
దీనితో ధనుష్ – మృణాల్ ఠాకూర్ వివాహం గురించి వస్తున్న అన్ని వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.